జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కల్పించండి
కకలెక్టర్కు పీడబ్ల్యుజేఎఫ్ వినతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ జిల్లాలో అర్హు లైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు విశాఖ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిసి స్కూల్ ఫీజు రాయితీ విషయమై వినతిపత్రం సమర్పించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్ అధ్యక్షులు పి.నారాయణ్ ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడ జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించిన విషయాన్ని వివరిస్తూ, వాటి చెందిన ఉత్తర్వులను అందజేశారు. 2016 నుంచి విశాఖ జిల్లాలో జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించిన ఉత్తర్వులను కూడా కలెక్టర్‌కు సమర్పించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. విశాఖ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కల్పించే విషయమై తదుపరి చర్యలు తీసుకుంటా మన్నారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణ్‌లు మాట్లాడుతూ స్కూల్ ఫీజుతోపాటు, ఇంటర్‌కు సంబంధిం చి కూడా గతంలో కొన్ని కళాశాలలు జర్నలిస్టులకు రాయితీ ఇచ్చారని ఆ దిశగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మధన్, స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియే షన్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్, శ్రీనివాసరావు. జిల్లా నాయకులు పితాని ప్రసాద్, శివప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.