ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం
కస్వాతంత్య్ర దిన వేడుకల్లో ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం కదేశ ప్రజలకు శుభాకాంక్షలు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): భారతదేశ 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని ఢల్లీిలోని ఎర్రకోటపై వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ గురించి మాట్లాడారు. రక్షణ, సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధిని సాధించడమే దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఈ క్రమంలోనే దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్లే ఉండాలని.. అలాగే సెమీకండక్టర్ల తయారీలో భారత్ ముందంజలో ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇది భారత భవిష్యత్ ప్రగతికి ఒక కొత్త దారిని చూపిస్తుందని ఆయన అభివర్ణించారు.
ఒక యుద్ధ విమానం విజయానికి.. దాని ఇంజిన్ చాలా ముఖ్యమని ప్రధాని మోదీ వివరించారు. అది లేకుండా విమానం కేవలం ఒక అందమైన శిల్పం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పౌరులకు సులభంగా అర్థమయ్యేలా ఉదాహరణతో వివరించారు. ముఖ్యంగా దేశీయంగా తయారు చేస్తున్న యుద్ధ విమానాలకు విదేశీ ఇంజిన్లపై ఆధారపడటం సరికాదని సూచించారు. ఈ విషయంలో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నిపుణులకు ఆయన ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. మన సొంత ‘మేడ్ ఇన్ ఇండియా’ యుద్ధ విమానాలకు మన ఇంజిన్లను తయారు చేసే సామర్థ్యాన్ని సాధించాలని.. తద్వారా రక్షణ రంగంలో దేశం సంపూర్ణంగా స్వయం సమృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఆపరేషన్ సిందూర్’ లాంటి విజయాలు భారత్ సైనిక పరాక్రమానికి నిదర్శనాలని, విదేశీ సాయం లేకుండానే స్వంత శక్తితో ఈ విజయాలు సాధించడం సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు.
మోదీ పంధ్రాగస్టు కానుక: వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై నుంచి జాతీయ జెండాను ఎగురువేసి.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా దేశంలో యువతకు శుభవార్త చెప్పారు. వారి కోసం ఓ కొత్త పథకం ఈ రోజే ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లలో దేశంలోని 3.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ పథకానికి గతంలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఉపాధి, కార్మిక శాఖ తెలిపింది.
79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశంలోని యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త అందజేశారు. రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఢల్లీిలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో యువత కోసం పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రయివేట్ సెక్టార్లో తొలిసారి ఉద్యోగ రంగంలోకి చేరిన యువతీ యువకులకు రూ.15,000 కేంద్రం అందజేయనుంది.ఈ పథకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడిరచారు. దీని ద్వారా దేశంలోని 3.5 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని వివరించారు.
ఆగస్టు 15.. దేశంలోని యువత కోసం లక్ష కోట్ల రూపాయాలతో కొత్త పథకం ప్రారంభిస్తున్నాం.. మీకు ఇది శుభవార్త.. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ప్రారంభం కానుంది’’ అని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ఆమోదించినట్టు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత నెలలో తెలిపింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని అని జులై 25న వెలువరించిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. వీరిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తారు. ‘వికసిత్ భారత్ లక్ష్యాలకు అను గుణంగా ఈ పేరు ఉంది.. దేశంలో సమ్మిళిత, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ మొదటి సారిగా ఉపాధి పొందుతున్నవారు.. పార్ట్ బి కింద యజమాన్యాలు వస్తాయి.