మేడ పైనుంచి దూకేస్తానన్న వివాహితను
కాపాడిన పోలీసులు, బ్లూ కోర్టు సిబ్బంది
అక్షర కిరణం, (మధురవాడ): శివశక్తి నగర్లో భార్యభర్తల మధ్య రూ.500 వివాదం రగల్చింది. దీంతో మనస్థాపం చెందిన భార్య మేడ మీదకు ఎక్కి కిందకు దూకేస్తాను అంటూ బెదిరించింది. ఈ సమాచారం అందు కున్న పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆదేశాలతో ఎస్ఐ భాస్కరరావు సంఘటన స్థలానికి చేరుకొని బ్లూ కోర్ట్ సిబ్బంది లోవరాజు, ఈశ్వర్ సహాయంతో మెడ పైకి ఎక్కి ధైర్య సాహసాలతో ఆ మహిళను కాపాడారు. పీఎం పాలెం ఎస్ఐ భాస్కర్, బ్లూ కోర్టు సిబ్బంది లోవరాజు, ఈశ్వర్‌ను అక్కడ ఉన్న ప్రజలు, పీఎం పాలెం స్టేషన్ సిబ్బంది అభినందించారు.