ఫొటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ
అక్షర కిరణం, (విశాఖపట్నం): వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహించే ఫొటో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఆవిష్కరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు వై.రామకృష్ణ, కార్యదర్శి ఎండీ.నవాజ్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబులతో కలిసి ఫొటో ఎగ్జిబిషన్ పోస్టర్‌ను కమిషనర్ కేతన్ గార్గ్ ఆవిష్క రించారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భం గా వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ మ్యూజియంలో రెండు రోజులపాటు ఈనెల 19, 20 వ తేదీలలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు అసోసి యేషన్ సభ్యులు తెలిపారు.