13వ వార్డులో లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): విశాఖ తూర్పు నియోజకవర్గం 13వ వార్డు సచివాలయం 7 పరిధిలో కొత్త పెన్షన్లలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశాల మేరకు వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ, టీడీపీ వార్డు నాయకులు సచివా లయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా 13వ వార్డులో కొత్తగా 2 వితంతు పెన్షన్లు 2 డయాలసిస్ పెన్షన్లు మంజురు వచ్చాయని తెలిపారు. కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన సేనాపతి అప్పారావు గత నెలలో మృతి చెందడంతో భార్య సత్యవతికి వితంతు పెన్షన్ అందజేసి నట్టు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు సురేష్ చిట్టినాయుడు, టీడీపీ నాయకులు పీ.ఆనందరావు, ఓసెట్టి పైడిరాజు, అడ్డూరి వెంకటరమణ, టీ.కేశవరావు, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.