శ్రీవారి సన్నిధిలో దీక్ష విరమించిన పవన్
ఇద్దరు కుమార్తెలతో కలసి శ్రీనివాసుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
అక్షర కిరణం, (తిరుమల): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. తితిదే అధికారులు పవన్‌కు స్వామివారి చిత్ర పటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరి గొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 రోజులపాటు దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన.. అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం తిరుమలలో దీక్షను విరమించారు.
మంగళవారం సాయంత్రం తిరుమల మెట్లమార్గంలో నడుచుకుంటూ పవన్ కల్యాణ్ కొండపైకి చేరుకున్నారు. బుధవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్.. గొల్ల మండపంలో పండితు లు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికా రులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలిం చారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరిం చారు. ఆ తరువాత టీటీడీ అధికారులతో సమావేశం అయ్యారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే పవన్ బస చేయనున్నారు. గురువారం సాయంత్రం 4గంటలకు కొండ కిందకు చేరుకొని తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం విజయ వాడకు తిరుగు ప్రయాణం అవుతారు.
పవన్ స్వామివారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం బయట మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. బుక్ కవర్ పేజీ పైభాగంలో ధర్మో రక్షతి రక్షితః అని రాసి ఉంది. మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలో ఈ బుక్ గురించి వివరించే అవకాశం ఉంది.