తిరుమల వేంకటేశ్వరుని కోసం బయలుదేరిన పలాస జీడిపప్పు
జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు
అక్షర కిరణం, (పలాస): తిరుమలకు వేంకటేశ్వరు ని ప్రసాదంలో వినియోగించేందుకు పలాస జీడిపప్పు సిద్ధమంది గురువారం పలాస నుంచి జీడిపప్పుతో నిండిన ప్రత్యేక వాహనం పలాసకు బయలుదేరి వెళ్లింది. శ్రీకా కుళం జిల్లా పలాస కాశీబుగ్గ నుంచి తిరుమలకి వెళ్తున్న జీడిపప్పు వాహనాన్ని రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రారంభిం చారు. గరుడ వాహనాన్ని రాష్ట్ర మంత్రి అచ్చన్ననాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారీ కోసం ఇక నుంచి నాణ్యమైన జీడిపప్పు పలాస నుంచి వెళుతుందని మంత్రి అచ్చన్న నాయుడు తెలిపారు. పలాస ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న జీడి పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వద్దకు బయలుదేరింది. జీడిపప్పు కంటైనర్ను రాష్ట్ర మంత్రి అచ్చన్న నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి ప్రారంభించారు. 40 ఏళ్ల తరువాత పలాస నుంచి జీడిపప్పు వేంకటేశ్వర స్వామి వద్దకు జీడిపప్పు రవాణా అవుతుందన్నారు.