13న శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ
అక్షర కిరణం, (పలాస): పలాస మున్సిపాలిటీలో ఓల్డ్ ఎన్‌హెచ్‌పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఆరోజు చిలుకల ద్వాదశి సందర్భంగా ఉసిరి చెట్టు కింద, వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిసర ప్రాంత అయ్యప్ప మాలధారులు పడిపూజకు హాజ రుకావాలని కోరారు. దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన 18 మెట్ల పూజకు కూడా హాజరుకావాలని కొండే నరసింహ, పార్వతీశం గురుస్వామిలు, అమ్మ ఆశ్రమం దత్తయ్యప్ప స్వామి దేవాలయం వ్యవస్థాపకులు రామస్వామి కోరారు.