మాది మెతక ప్రభుత్వం కాదు.. సరస్వతి భూముల కోసం పెట్రోల్ బాంబులు వేసి భయపెట్టారు
వేమవరంలోని సరస్వతి పవర్ ప్రాజెక్టు ప్లాంట్ భూములు సందర్శించిన పవన్ కళ్యాణ్
అక్షర కిరణం, (పల్నాడు జిల్లా): ‘మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం మాత్రం కాదు. మేం మెతక వైఖరితో లేము అని చెప్పడానికే సరస్వతి భూముల వద్దకు వచ్చి మాట్లాడుతున్నాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని మాచ వరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైఎస్ఆర్ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టుకు తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. నేటికి సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదు. ఇందులో 1,384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇంత చేసినా ఫ్యాక్టరీ పెట్టలేదు. కానీ అన్నాచెల్లెళ్లు మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అటవీ భూము లను రెవెన్యూ భూములుగా మార్చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు లీజును 50 ఏళ్లకు పెంచారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారని... భూము లు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేసి వేధించా రని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇన్నేళ్లయినా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే వైఎస్ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూముల సేకరణపై అనేక అనుమానాలు ఉన్నాయని అందువల్లే విచారణకు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములకు సంబంధిం చిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు అందులో ఉద్యోగాలు కల్పిస్తామ ని చెప్పారని అన్నారు. ఇష్టం లేకున్నా ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకు వచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులపై భూములు విక్రయించేలా తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆ నేపథ్యంలోనే పెట్రోల్ బాంబులు వేసి వారిని భయపెట్టారని గుర్తు చేశారు. ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 ఎకరాల భూమిని భయపెట్టి మరీ తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. దళితుల నుంచి లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దళితులు, నిరుపేదల భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.
ఈ వ్యవహారంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సహాజవనరులు ఒకరి సొత్తు కాదు.. ఒకరి సొంతం కాదు అని డిప్యూటీ సీఎంప వన్ కల్యాణ్ అన్నారు.