27న విద్యుత్ చార్జీలపై వైసీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ
అక్షర కిరణం, (మాధవధార): మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న జరిగే విద్యుత్ చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’’ పోస్టర్ ఆవిష్కరిం చారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజలమీద భారం మోపిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట నిర్వహిస్తోందని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతూ విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు, నగర మేయర్ హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు, రవీంద్ర బాబు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షు రాలు పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు.