ఎంవీపీ రైతు బజార్లో అధికారుల తనిఖీలు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ఎంవీపీ రైతుబజార్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తనిఖీ చేశారు. నేరుగా రైతులు వద్దకు వెళ్లి మాట్లాడారు. రైతులు ఏ ఏ గ్రామాల నుంచి వస్తున్నారు. ఏమేమి కాయగూరలు తెచ్చి అమ్ముతున్నారు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల కల్పించా లని ఈవో వరహాలుకి సూచించారు. వేసవి కాలం కావడంతో వచ్చే వినియోగదారులకు మంచినీరు వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. ధరల పట్టిక సూచిక బోర్డులను వినియోగదారులకు చక్కగా కనిపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంవిపి రైతుబజార్‌ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సీఎస్ సత్యనారాయణ తెలిపారు. ఈ తనిఖీల్లో మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ యాసిన్, ఈవో సహాయ కుడు కనకరాజు, రైతులు పాల్గొన్నారు.