ఘనంగా జాతీయ లైబ్రేరియన్ దినోత్సవం
అక్షర కిరణం, (విజయనగరం): జేెఎన్టీయూ-జీవీ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి పితామహుడైన డాక్టర్ ఎస్ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా జాతీయ లైబ్రేరియన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతి ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీజే సుమ, అకడమిక్ ఆడిట్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు హాజరయ్యారు. సీనియర్ సిటిజన్, సామాజిక, సాంస్కృతిక కార్యకర్త ఎస్కే. గౌస్ బాషా, ప్రముఖ కవి, కథాకథనకారుడు పప్పు భోగరావు ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో వారు, యువతలో పుస్తక పఠనం, గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించి, భవిష్యత్తులో వారిని బాధ్యతా యుతమైన, నాణ్యమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో వీటి పాత్రను హైలైట్ చేశారు. ఈసందర్భంగా సెంట్రల్ లైబ్రరీ సిబ్బంది ఈశ్వర రావు, పీడీ సత్యనారాయణ, బి.రాము, ఎస్.భాస్కరరావు, మూర్తి, విజయశ్రీ, దేవి, లైబ్రరీ ఇన్ఛార్జ్, డీడీవీ శివరాం రోలంగి ఆధ్వర్యంలో తెలుగు సాహితి సమితి అధ్యక్షుడు అంజనేయ శర్మ, ఆయన బృందం సహకారంతో ఓపెన్ లైబ్రరీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం విశ్వవిద్యా లయ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో పఠన సాంస్కృతికాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఓపెన్ లైబ్రరీలో విద్యార్థులు పాల్గొన్నారు.