సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కమున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు కశానిటేషన్ కార్యదర్శులతో సమావేశం
అక్షరకిరణం, (పలాస): పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్ కార్యదర్శులతో కమిషనర్ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం కాలానుగుణంగా వస్తున్న వ్యాధులపై సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా సిబ్బంది అందరూ ప్రజలను చైతన్యవంతులను చేసి, ఇంటింటికి వెళ్లి వ్యాధుల గురించి విశదీకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధుల్లో కాలువలలోను, ఖాళీ స్థలంల వద్ద గల మురికి గుంట్లలో లార్వా (దోమలు) అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు శానిటరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.