26 నుంచి మౌంట్ అబులో బ్రహ్మకుమారీల జాతీయ మీడియా సదస్సు
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని విశాఖ డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. బాలయ్య శాస్త్రి లే అవుట్ వద్ద గల సింధూర అతిథి గృహంలో బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం మీడియా వింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని కోరారు. విశాఖ జర్నలిస్టులు ఈ సదస్సు విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల యాత్ర విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనను, జాతీయ వినియోగదారుల మండలి చైర్మన్ సాయిరమేష్, నంది అవార్డు గ్రహీత శివ జ్యోతి, ఇతర అతిథులను శాలువ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జర్నలిస్టుల దినోత్సవం నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంతర్జా తీయ ముఖ్య కేంద్రంలో జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామే శ్వరి తెలిపారు. 26 నుండి 30 వరకు జరిగే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు 32 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. సదస్సులో రాజయోగ ధ్యానం తదితర క్లాసులు జరుగుతాయ న్నారు. న్యాయ మూర్తులు, మీడియా ప్రతినిధులకు పలు అంశాలు మీద సేషన్లు, వర్క్‌షాపులు వుంటాయని తెలిపారు. జర్నలిస్టులకు సెప్టెంబర్ 29న అక్కడ పలు ప్రాంతాల సైట్ సీయింగ్ కూడా వుంటుందన్నారు. బిల్వాడి దేవాలయం సందర్శనం వుంటుంన్నారు. సదస్సులో పాల్గొనే జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేస్తాం అన్నారు. అక్టోబర్‌లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నేత దాడి సత్య నారాయణ వంటి ప్రముఖులు పాల్గొం టారని తెలిపారు. జాతీయ సదస్సులో పలు రిలాక్స్ విధానాలు బోధిస్తారు అన్నారు. జాతీయ వినియోగదారుల మండలి చైర్మన్ సాయి రమేష్, బ్రహ్మ కుమారీస్ సంస్థ సభ్యులు సిద్దు, మురళీకృష్ణ, సునీత, నారాయణ, భవాని, సత్యవతి, లావణ్య, పావని, రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.