మోర్సింగ్ వెంకటేష్‌కు మద్రాస్ ముక్కు అకాడమీ గౌరవం
కఆకాశవాణి గ్రేడ్ కళాకారుల అభినందన
అక్షర కిరణం, (విశాఖపట్నం):: విశాఖ నగరానికి చెందిన మోర్సింగ్ కళాకారులు గొట్టుముక్కల వెంకటేష్ కు మద్రాసు మ్యూజిక్ అకాడమీ గౌరవం దక్కింది. ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ వెంకటేష్ 2024 డిసెంబర్ నెలలో మద్రాస్ అకాడమీ నిర్వహించిన కచేరీలో పాల్గొన్నారు. అకాడమీ 98 వ ప్రదర్శనగా అనిరుద్ వెంకటేష్ సంగీత కచేరి ఇచ్చారు. ఈప్రదర్శన ఉత్తమ ప్రదర్శనగా ఎంపికయింది. ఈ ప్రదర్శనలో వెంకటేష్ మోర్సింగ్ సహకారాన్ని అందజేశారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డుకు ఎంపికైన వెంకటేష్‌ను విశాఖ నగరంలోని సంగీత కళాకారులు ఆకాశవాణి గ్రేడ్ ఆర్టిస్టులు అభినందించారు.