క్యాన్సర్ వ్యాధి నిరోధానికి మోదీ సర్కార్ విప్లవాత్మక చర్యలు
కబీజేపీ నాయకుడు మూల వెంకటరావు
అక్షర కిరణం, (మాధవధార): దేశంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్ భారత్ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్ మూల వెంకట్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా 200కు పైగా క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారని, అందులో ఏపీకి 14 సెంటర్లు కేటాయించడం హర్షదాయ కమన్నారు. క్రిష్ణా, బీఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, విజయ నగరం, అన్నమయ్య, పల్నాడు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో క్యాన్సర్ డి కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఆనంద దాయకమన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ సెంటర్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆయుష్ మాన్ భారత్-
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద క్యాన్సర్ మహమ్మరి నుంచి రోగులను రక్షించేందుకు, విస్తృత సేవలు అందించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధపడడం కోట్లాదిమంది క్యాన్సర్ బాధితులకు వరం లాంటిదని మూల వెంకటరావు అభిప్రాయపడ్డారు. అందరి కీ ఆరోగ్యం అనేది మోదీ సంకల్పమని ఆదిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కేర్ సెంటర్లలో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు విరివిగా నిర్వహించి, వారు గర్భ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు చేపడతారని చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి క్యాన్సర్ కారణం గా 30 వేల మందికి పైగా చనిపోతున్నారని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ డే కేర్ సెంటర్లతో బాధితులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని, పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తొలి దశలోనే ఏపీకి 14 సెంటర్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన మూల వెంకటరావు మిగిలిన జిల్లా లకు కూడా తొందరగా క్యాన్సర్ డే కేర్ సెంటర్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి 14 క్యాన్సర్ డే కేర్ సెంటర్లు సాధించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.