మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి
కరాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం
అక్షర కిరణం, (విజయనగరం): మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్టికి కాంప్లెక్స్ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో ఆశీనులైన ఎంఎల్ఏలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవికి ఉచిత ఆర్టిసి బస్సు టిక్కెట్లను తమ చేతులమీదుగా మంత్రి అందజేశారు. అనంతరం అదేబస్సులో కూటమి పార్టీల నేతలతో కలిసి గజపతినగరం వరకు మంత్రి ప్రయాణించారు. కార్యక్రమంలో తూర్పుకాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, కూటమి పార్టీల నాయకులు పడాల అరుణ, రెడ్డి పావని, డ్వాక్రా మహిళలు సన్యాసమ్మ, పార్వతి మాట్లాడారు. డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున, డిసిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, ఇతర ఆర్టిసి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.