రూ.3.65 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన
అక్షరకిరణం, (సాలూరు): అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె దీనిలో భాగంగా రూ.3.65కోట్లతో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సాలూరు మండలం చంద్రపువలస నుండి ముగ డవలస వరకు రూ.కోటి 60లక్షలు, చిన్నివలస నుండి పులి కిలివలస బీటీ రోడ్డు తారురోడ్డుకు రూ.50లక్షలు నిధుల తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుండ్రపువల స నుండి ఖరాసువలస బీటీతారు రోడ్డుకు నిర్మాణం కోసం కోటి 50 లక్షలు మొత్తం మూడు రోడ్లకు కలిపి రూ.3.65 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సంధ్యారాణి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పాలన గాలికి వదిలేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతి, నాయకులు ఆముదాల పరమేశు, పిన్నింటి ప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.