శ్రీశ్యామలాంబ సిరిమాను చెట్టు ఊరేగింపులో మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): శ్రీశ్యామలాంబ అమ్మ వారి సిరిమాను చెట్టు ఊరేగింపు ఆదివారం నిర్వహించా రు. ఈకార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి హాజరై దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి సంధ్యారాణి మాట్లా డుతూ శ్రీశ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగిం పు సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా నిర్వ హించడం అభినందనీయమన్నారు. సిరిమాను ఊరేగింపు ను సాలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రారంభమై శ్రీశ్యామలాంబ అమ్మవారిగుడి, శివాజీ బొమ్మ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మామిడిపల్లి జంక్షన్, డబ్బివీధి కేహెచ్ స్కూల్ డబ్బివీధి రామమందిరం, పెదకోమ టిపేట, కోటవీధి దుర్గమ్మగుడి, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, గొల్లవీధి, బోసు బొమ్మ సెంటర్, శివాజీ బొమ్మ జంక్షన్, నాయుడువీధి రామమందిరం వరకు కొనసాగిందని తెలిపారు. సిరిమా ను ఊరేగింపులో ట్రాఫిక్ సమస్య లేకుండా సాలూరు సీఐ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాలూరు మాజీ జమిందార్ విక్రమ్చంద్ర సన్యాసి రాజు, మాజీ ఎమ్మల్యే ఆర్పీ భంజ్ దేవ్ ఉత్సవకమిటీ అధ్యక్షు లు అప్పారావు ఉత్సవ కమిటీ సభ్యులు నిమ్మాధి తిరుపతి జన్నీపూజారి సాలూరు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.