నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభంచిన మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు ఆర్టీసి డిపోలో నూతన ఆర్టీసీ బస్సును మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. తదనంతరం మంత్రి సంధ్యారాణి బస్సును నడిపి డ్రైవర్లకు స్ఫూర్తి నిచ్చారు. మంత్రి సంధ్యా రాణి మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంద న్నారు. నూతన బస్సుల ప్రారంభంతో పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ బస్సులతో ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతోపాటు, ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని తెలి పారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కౌన్సిలర్లు, సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి. ట్రాఫిక్ మేనేజర్ కరుణశ్రీ, టీఐ మంగమ్మ, డిపో కార్యద ర్శులు కిరణ్కుమార్, శేఖర్ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.