ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
కరాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల మంత్రి పార్థసారథి
అక్షర కిరణం, (అమరావతి): నూజివీడు ట్రిపుల్ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారులతో మాట్లాడి సంఘటనకు గల కారాణాలఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థలో చదువుతున్న విద్యార్ధులు అందరికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలని, అనారోగ్యానికి గురైన విద్యార్థుల కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశిం చారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పార్థసారథి ట్రిపుల్ ఐటీి రిజిస్ట్రార్ ఇతర అధికారులతో మాట్లాడి విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, వారి ఆరోగ్యంపై అశ్రద్ధ వహించవద్దని, ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఈసంఘటనపై విచారణ జరిపి సమగ్రమైన నివేదికను తక్షణం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేసేరు. తక్షణం నుజీవీడు ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులకు అందుతున్న వైద్యం, విద్యార్థులు ఎందుకు అనారోగ్యానికి కావడానికి గల కారణాలపై ఆరా తీయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సెర్మిష్ట నూజివీడు ట్రిపుల్ ఐటీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కళాశాలలో అపరిశుభ్రత లేకుండా చూడాలని మంత్రి పార్ధసారధి ఆదేశించారు.