బుద్ధిబలంతోనే మానసిక ఎదుగుదల సమతుల్య జీవనం సాధ్యం
శ్రీపీఠం స్వామిజీ పరిపూర్ణానంద
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు. మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో జరి గిన కార్యక్రమంలో ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ‘వేదాంత విద్య’తో ఋషులు అందించారని తెలిపారు. సమా జపరంగా ఎంతప్రగతిని సాధించినా మానసికమైన ఎదుగుదల, సమతుల్యమైన బుద్ధిబలంతో మాత్రమే మనిషి ఆనందంగా జీవించగలడన్నారు. ఈ విషయాన్నే భగవద్గీత లో శ్రీకృష్ణ పరమాత్మ, ప్రకరణ గ్రంథాల్లో ఆదిశంకరాచా ర్యులు, తమ ఉపదేశాలతో రమణ మహర్షి అందించారని చెప్పారు. నేటి ఆధునిక జీవన పరిస్థితులను పరిగణిస్తూ, అందరికీ ఆచరణ యోగ్యమైన సాధన రహస్యాలను పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి అందించే ప్రయత్నమే ఈ ‘సాధన రహస్యం’ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆధ్యాత్మిక జీవనం కొనసాగించాలని కోరారు. కార్యక్రమం లో శ్రీపీఠం ప్రతినిధులు పాల్గొన్నారు.