రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు
కకలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్
అక్షర కిరణం, (విజయనగరం): జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్క్‌ఫెడ్, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రైవేటు వ్యాపారులకు కేటాయింపులు తగ్గించి, రైతు సేవ కేంద్రలకు ఎరువుల కేటాయింపు పెంచాలని అన్నారు. వ్యవ సాయ శాఖ అధికారులు ఎక్కడ యూరియా అవసరం ఉన్నదో గమనించి అక్కడి రైతుసేవ కేంద్రలకు మాత్రమే యూరియా పంపాలన్నారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా, ఇతరాలు యూరియాతో లింక్ చెయ్యకుండా చూడాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల నిల్వల స్థితి, డిమాండ్, సరఫరా తదితర అంశాలను వివరిం చారు. ఖరీఫ్ 2025 సీజన్‌కు కావలసిన ఎరువుల సరఫరాను సమర్థవంతంగా చేసేందుకు అన్ని చర్యలు తీసు కుంటున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా చూడాలని కోరారు. ఈ సంవత్సరం వర్షాలు ముందు గానే రావడం వల్ల సాగు వేగంగా సాగుతోందనీ చెప్పారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌తో పోల్చితే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం స్పష్టంగా పెరిగిందన్నారు. 2024 ఆగస్టు 4 నాటికి 35,233 హెక్టార్లు కాగా, 2025 ఆగస్టు 4 నాటికి 54,850 హెక్టార్లు సాగు నమోదయ్యిందన్నారు. ఈనెల 31 నాటికి 95,660 హెక్టార్లకు చేరనున్నదని అంచనా వేస ినట్లు చెప్పారు. పెరిగిన సాగు ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 2025 నెలలో యూరియా 10,000 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతుం దని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం సాగు కొనసాగుతున్నం దున తక్షణ అవసరంగా యూరియా 2,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,000 మెట్రిక్ టన్నులు వెంటనే అవసరమై ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యంలో, జిల్లాకు తక్షణంగా అవసరమైన యూరియా అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ సంచాలకునికి లేఖ పంపినట్లు కలెక్టర్ వివరించారు.