శాంతి చర్చలపై మావోయిస్టుల కీలక ప్రకటన
కవరుస ఎన్కౌంటర్లతో ఎదురుదెబ్బ
కచర్చలకు సిద్ధమంటూ ప్రకటించిన నక్సల్స్
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): దండకారణ్యంలోని మావోయిస్ట్ కంచుకోటలు బద్ధలవుతున్నాయి. నక్సల్స్ స్థావరాల్లోకి భద్రతా సిబ్బంది చొచ్చుకుపోయి.. మెరుపు దాడులతో హడలెత్తిస్తున్నాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో వందల మంది మావోయిస్ట్‌లు వేర్వేరు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ ఏడాది మూడు నెలల్లో 130 మందికి పైగా మావోయిస్ట్‌లు మృతిచెందారు. అయితే, 2026 నాటికి దేశ:లో పూర్తిగా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది కాలంగా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోన్న మావోయిస్ట్‌లు శాంతి చర్చలపై కీలక ప్రకటన చేశారు. ప్రజాప్రయోజనాల కోసం తాము శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. ఇందుకోసం అనుకూల వాతావరణం సృష్టించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రaార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఆక్కడ జరుగుతోన్న మారణకాండను ఆపేయాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైతే తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తామని వెల్లడిరచారు. ఈ మేరకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖను విడుదలైంది. అయితే దీనిపై బీజీపే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.