మన్యం ధీరుడు సినిమాకి తోలి ప్రేక్షకుడు టీఎస్సార్
కచిన్న సినిమాలకు హబ్‌గా విశాఖ: బాదంగీర్ సాయి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు. చిన్న సినిమాలకు హబ్‌గా మార బోయే విశాఖలో నిర్మితమై ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోయే మన్యం ధీరుడు స్వయంగా సుబ్బరామిరెడ్డి చూసి ఆశీస్సులు అందజేయనున్నార న్నారు. రంగసాయి మీడియా అధినేత బాదంగీర్ సాయి ఆధ్వర్యంలో వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో బాదంగీర్ సాయి, తెలుగు శక్తి అధినేత బీవీ రామ్ పాల్గొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశామని ఈచిత్రాన్ని రంగసాయి మీడియా పంపిణీదారునిగా మారి వేంకటేశ్వర థియేటర్లో ప్రదర్శిస్తున్న ట్లుగా బాదంగీర్ సాయి తెలిపారు. దాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్‌గా మారబోతుందన్నారు. 1982 లో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం ప్రారంభించానని సిని మా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు. గత 38 ఏళ్లుగా కళా సేవ చేస్తున్నానని చెప్పిన బాదంగీర్ సాయి చినుకు సినిమాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమాను విడు దల చేశాను అని గుర్తు చేసుకున్నారు. ఈనెల 20 న సినిమా విడుదల అవుతుందని తెలి పారు. నిర్మాత, అల్లూరి సీతారామరాజు పాత్రధారి ఆర్వీవీ సత్యనారాయణ మా ట్లాడుతూ తాను ఇష్టపడి ఈ సినిమా తీసానన్నారు. విశాఖ నటులు జబర్దస్త్ అప్పారావు స్థానిక కళాకారులు నటిం చారని చెప్పారు. సంగీతంను పవన్ అందించారని తెలిపారు. అందరూ సినిమా ఆదరించాలని కోరారు. కార్యక్ర మంలో పంపిణీదారుడు కాండ్రే గుల ఆదినారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, దర్శకుడు డెక్కల నరేష్, వినీత్ ఆర్య, సీనియర్ జర్నలిస్టు ఎన్ఎన్ఆర్, సీనియర్ జర్నలిస్టు బిఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.