నులి పురుగులతో పిల్లల్లో అనేక శారీరక రుగ్మతలు
చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జాతీయ నులి పురు గుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ వారం మద్దిలపాలెం అంగన్వాడీ సెంటర్ 4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీలో చైల్డ్ రైట్స్ అవెర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం పాల్గొని పిల్లలకు మాత్రలు అందించారు. అనం తరం సీతారాం మాట్లాడుతూ పిల్లల కడుపులో క్రిములు (పొట్టలో నట్టలు)వల్ల కలిగే అనారోగ్య, దీర్ఘకాలిక సమస్య లు లెక్కకు మించి ఉంటాయని తెలిపారు. ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల లోపు వయస్సున్నవారంతా ప్రతియేటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో రెండు మోతాదులు మాత్రలు వేసు కోవడం వల్ల ఆకలి మందగించడం, నీరసం, మందకొడి తత్వం, బరువుతగ్గడం, రక్తహీనత, మలద్వారం చుట్టూ దురద వంటి లక్షణాలను దూరం చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం నగర కన్వీనర్ కె. ఎల్లయ్య, అంగన్వాడీ సెంటర్ కార్యకర్త మాధవి, ఏఎన్ఎం మువ్వల సుజాత, ఆశా కార్యకర్తలు రామానుజం, లక్మి కుమారి, కె.శ్రీదేవి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.