కొండమ్మ వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
మాజీ మంత్రులు గౌతు శివాజీ, సీదిరి అప్పలరాజు పూజలు
అక్షర కిరణం, (పలాస): పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండలో సోమవారం కొండమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, సూదికొండ గ్రామదేవత కొండమ్మ వారిని దర్శించుకొని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కొండమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరు సుభిక్షాలతో ఆ దేవి ఆశీస్సులు ఈ ప్రాంతంపై ఉండాలని కోరారు.
కార్యక్రమంలో గురిటి సూర్య నారాయణ, లొడగల కామేశ్వరరావు, స్థానికులు దాసరి చిన్నరావు, జోగ తిరుపతి, దడియాల నరసింహులు,బద్రి గోపాల్, జోగ సింహాద్రి, మాజీ కౌన్సిలర్ సవర రాంబాబు, బొంతల దాసు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు
సూదికొండ గ్రామదేవత కొండమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి అప్పలరాజు భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో బడగల బాలచంద్రుడు, ఎంపీపీ, డొక్కరి దానయ్య, అంబటి ఆనందరావు, బల్ల శ్రీనివాసరావు దొర, కింతల బాబురావు, భవాని స్వాములు, పలువురు గ్రామస్థులు తది తరులు పాల్గొన్నారు.