ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శాంతారావుకు పలువురి అభినందనలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఏఎస్ఐగా పదోన్నత పొందిన ఎస్.శాంంతారావు బుధవారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఏఎస్ఐ ఎస్.శాంతారావుకు పలువురు అభినందనలు తెలిపారు. శాంతారావు సౌత్ సబ్ డివిజన్ పరిధిలో గాజువాక ట్రాఫిక్, గాజువాక లాండ్ అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, దువ్వాడ లాండ్ అండ్ ఆర్డర్ విభాగంలో విధులు నిర్వహించి పలువురు వద్ద నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఎస్.శాంతారావుకి ఏఎస్ఐగా పదోన్నతి లభించడంపై పలువురు అభినందనలు తెలియజేశారు. శాంతారావు తన విధుల్లో మరిన్ని ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.