కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం
అక్షరకిరణం, (సింహాచలం): మహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిం చారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులే నేరు గా ఈశివలింగాలకు అభిషేకం చేసుకున్నారు. సుబ్బరామి రెడ్డి భక్తులకు పసుపు తాళ్లు అందచేసారు.. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు కోటి శివలింగాలకు మహా అభిషేకం చేశారు. సుబ్బరామి రెడ్డి వీరితో అభిషేకం చేయించారు. అనంతరం సింహగిరి పైన అప్పన్న క్షేత్రపాలకులు త్రిపురాంతక స్వామి ఆలయంలో కూడా గంట్ల శ్రీనుబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సింహాద్రి నాధుని వీరు దర్శించుకున్నారు.