నియోజకవర్గంలో ఆర్టీసీ సమస్యలపై సంస్థ చైర్మన్తో ఎమ్మెల్యే శిరీష బేటీ
అక్షరకిరణం (పలాస): పలాస నియోజకవర్గ ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మర్యాద పూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కా రానికి చైర్మన్ నారాయణకు విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతా లకు పలాస కేంద్రంగా సర్వీసులు పెంచాలని కోరారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలను కల్పించాలని కోరారు. పరీక్షల సమయం అయినందున విద్యార్ధులకు అంతరాయం లేని బస్సు సేవలు అందించాలని ఈసందర్భంగా ఆమె కోరారు. ఎమ్మెల్యే శిరీషతో ఆమె భర్త నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఉన్నారు. ఉన్నారు.