సోమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి నియోజకవర్గం పెదగంట్యాడ మండలం అప్పికొండ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం నిర్వ హించారు. ఈపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర స్వామిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సతీ సమేతంగా దర్శించుకుని పత్యేక అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం దేవస్థానం ఈవో, కార్పొరేటర్ బట్ట సూర్యకుమారి, పంచకర్ల ప్రసాద్ రావు, వార్డు అధ్యక్షులు కాకి బాబు, చౌడేపల్లి మహేష్, నక్క శ్రీను, నర్సింగ్, కొండబాబు ముఖ్య నాయకులు పెదగంట్యాడ, పరవాడ మండలం కూటమి నాయకులు కార్యకర్తలు స్వామివారిని దర్శించుకోన్నారు.