అసెంబ్లీలో ఉద్దానం తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావన
అక్షరకిరణం, (పలాస): ఉద్దానంలో సమస్యలపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే గౌతు శిరీష గళమెత్తారు. ఆమె మాట్లాడుతూ ఉద్దానంలో ఉన్న రెండు నియోజకవర్గాలైన ఇచ్చాపురం, పలాసలో దాదాపు 7మండలాల్లో 2014-2019 మధ్య సీిఎం చంద్రబాబు కిడ్నీ సమస్యలపై ముందు చూపుగా సురక్షితమైన మంచినీటిని అందించే కార్యక్రమం చేపట్టారనీ, దాదాపు ఏడు మండలాల్లో 135 యూనిట్లు ఉండగా గత ఐదేళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 54 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఏడు మదర్ బోర్డులు పని చేయడం లేదన్నారు. పంచాయతీ శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న 135 యూనిట్లు బాగుచేయాలని కోరారు. కొన్ని పంచాయతీల్లో సుజల స్రవంతి ప్రాజెక్టు లేని ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి నీరు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.