రూ.10.20 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన
అక్షర కిరణం, (మధురవాడ): జీవీఎంసీ 5వ వార్డు లో రూ.10.20 కోట్ల అంచనాతో పలుఅభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గంటాకు 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ జోన్-2 పరిధి 5వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత శంకుస్థాపన చేశారు. యోధ్యనగర్ సచివాలయం నంబర్ 70నుండి ముత్యాలమ్మ గుడి వరకు, గ్లోబ్ స్కూల్ నుండి మల్లయ్యపాలెం వరకు తారురోడ్డు, బృందావన్ కాలనీ పార్క్ అభివృద్ధి, బొట్టవానిపాలెంలో సామాజిక భవనం నిర్మాణం, అయ్యప్పనగర్, చాకలిపేట, గాంధీనగర్, గణేష్‌నగర్, వికలాంగులకాలనీ, డ్రైవర్స్ కాలనీ, శివశక్తినగర్, కార్పెంటర్స్ కాలనీలలో సీసీ రోడ్డులు. కాలువలు, స్వతంత్రనగర్‌లో పార్క్ అభివృద్ధి నిమిత్తం, సాయిరాం కాలనీ, బోయపాలెం కాలనీ, పరదేశిపాలెం, మారికవలసలో సీసీ రోడ్డులు,కాలువలు, బోరవానిపాలెం, శ్రీనివాసనగర్‌లలో పార్కులు, వికలాంగుల కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కార్పెంటర్స్ కాలనీలలో వాటర్ సప్లై పైప్ లైన్స్ అభివృద్ధి నిమిత్తం శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వార్డులలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని అధికా రులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మొల్లి హేమలత, జోనల్ కమిషనర్ పి. సింహాచలం, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, రాష్ట్ర టీడీపీ నాయకులు పిల్లా వెంకట్రావు, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు, బోయి శ్రీను,భీమిలి నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు టీడీపీ, జనసేన అధ్యక్షులు పిల్లా నరసింగరావు, నాగోతి వెంకట సత్యనారాయణ, దేవర శివ, ఈగల రవికుమార్, బోయ రమాదేవి, ఆవాలనీలయ్య, బొడ్డేపల్లి రంగారావు, వైకుంఠ రావు, కర్మోజి గోవిందరావు, రోనంకె నారాయణరావు, దుర్గారావు, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.