ఎన్సీడీ`30 సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం
అక్షర కిరణం, (విశాఖపట్నం): నాన్ కమ్యూని కేబుల్ డిసీజెస్- హైపర్‌టెన్షన్, డయాబెటిస్, 3 క్యాన్సర్లు (ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు స్క్రీనింగ్ ఈనెల 14 నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ్తెలిపారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో అన్నీ లైన్ డిపార్ట్మెంట్లుతో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎస్సీడీ 3.0 సర్వే పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పురుషులు, మహిళలకు నోటి క్యాన్సర్ పరీక్ష లు నిర్వహిస్తామన్నారు. 30 ప్లస్ సంవత్సరాల మహిళ లకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అసాధారణ కేసులను వైద్య అధికారులు పరీక్షించి అనుమానితులను మంగళ, శుక్రవారాల్లో ఫాస్ట్ ట్రాక్ ఛానెల్‌తో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కేజీహెచ్‌కి సూచిస్తారని తెలిపారు. సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ 3.0 కార్యక్రమంపై సాధారణ ప్రజలకు మద్దతును అందించాలని అవగాహన కల్పించాలని అన్ని లైన్ డిపార్ట్మెంట్లను కోరారు. జిల్లాలో ఉన్న ప్రతి పౌరులు ఈ అవకాశంను విని యోగించికోవాలని ప్రతి ఒక్కరూ కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడంతో కాన్సర్ మహమ్మరిని ముందుగా గుర్తించి కాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యం కాపాడు కోవాలని కోరారు.