బీసీ వసతి గృహ విద్యార్థి మృతిపై నివేదిక కోరిన కేసలి అప్పారావు
అక్షరకిరణం, (విజయనగరం ప్రతినిధి): విజయ నగరం కాటవీధి వెనుకబడిన తరగతులు వసతి గృహం లో 7వ తరగతి విద్యను అభ్యసిస్తున్న రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు ఆదివారం ఉదయం ఫలహారం చేసిన అరగంట తరువాత కళ్లు తిరిగిపడిపోయిన వెంటనే వసతి గృహం సిబ్బంది, సహచర విద్యార్థులు జిల్లా సర్వ జన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే విద్యార్థి మరణించారని ఆసుపత్రి వైద్యులు తనిఖీ చేసి నిర్ధారించారు. ఈవిషయం తెలిసిన వెంటనే ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పా రావు జిల్లా కేంద్ర ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లి మృతుని తండ్రి, కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది వసతి గృహం సిబ్బంది, సహచర విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘట నపై ఆరా తీశారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియా ల్సి ఉందని జరిగిన సంఘటనపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్కు సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారికి ఆదేశా లు జారీ చేశారు.
మెడికల్ రిపోర్ట్, నివేదికలు వచ్చిన తరువాత కమిషన్ స్పందించి తదుపరి చర్యలకు ఆదేశాలు ఇస్తామ ని తెలిపారు. ఈకార్యక్రమంలో చైల్డ్ లైన్ సిబ్బంది మీనా, అరుణ్ పాల్గొన్నారు.