అత్యాచార నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు జాప్యంలో అధికార పార్టీ పాత్ర
కమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు
అక్షరకిరణం, (పలాస): బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితులపై ఎఫ్ఐఆర్ ఆలస్యంగా కట్టడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారపార్టీ ప్రోద్బలంతోనే ఆలస్యం జరిగిందని, నేరస్తులను రక్షించాలని వచ్చిన వత్తిడితోనే ఆలస్యం జరిగిందా అని నిలదీశారు. అసలు నేరస్తులు తీసుకెళ్లిన బాలికలు ముగ్గురా...ఇద్దరా..?అని అడిగారు. అసలు మూడో బాలిక కారణంగానే ఈవిషయం బయటకు వచ్చినట్లు పత్రికలలో చదివానని మరి ఇద్దరు బాలికలుగా కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి అప్పలరాజు బాధితుల ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి అప్పలరాజు పలాస లో జరిగిన సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే సోమ వారం మధ్యాహ్నంగాని ఎఫైర్ నమోదు కాలేదని సుమారు 40 గంటలు ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు. నిందితుల తల్లిదండ్రులు టీడీపీకి చెందిన కార్యకర్తలని ఆరోపించారు. నిందితులు వారి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు సంఘటన జరిగిన 40 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ వేశారు దీని దీని వెనుకున్నది ఎవరని ప్రశ్నించారు?. ఈసంఘటనలో ఎమ్మెల్యే నిందితులను తన ఆఫీసులో కూర్చోబెట్టి బాధితుల తల్లికి ఫోన్ చేశారని ఆరోపించారు. మేము పలాస ఎమ్మెల్యే తాలూకా అని బాధితుల తల్లిని బెదిరించారన్నారు. దీనికి ఎమ్మెల్యే కచ్చితం గా సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రోత్బలంతోనే బాధిత తల్లి కేసు పెట్టడానికి భయపడ్డారని సీదిరి అప్పల రాజు పేర్కొన్నారు.