బడ్జెట్లో అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
కజనసేన నాయకుడు కోత పూర్ణచంద్ర రావు
అక్షర కిరణం, (పలాస): రాష్ట్ర బడ్జెట్లో అన్ని రంగాలకు పెద్దపీట కూటమి ప్రభుత్వంలో నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పలాస నియోజక వర్గం జనసేన నాయకులు పలాస కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ క్రోత పూర్ణచంద్ర రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, సముచిత ప్రధాన్యం కల్పిస్తూ రైతు సోదరుల పక్షపాతీగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప భరోసాగా నిలవటం ఖాయమన్నారు. విద్యారంగానికి, వైద్య, స్కిల్ డెవలప్ మెంట్, పంచాయతీ ాజ్, ఉమేన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్, మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ వాటర్ రిషోర్స్ ఇరిగేషన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్,యూత్, స్పోర్ట్స్, టూరిజమ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్, ఎన్వీరాల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, కెప్టెల్ ఎక్సపెన్సిస్, ఇలా ప్రతి రంగానికి అభివృద్ధి పథంలో నడిపేం దుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన సరళితో గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిననందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికి ఆమోదదాయకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి రాష్టాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.