జానీ మాస్టర్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి
అక్షర కిరణం, (హైదరాబాద్): ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడిరచింది. జానీ మాస్టర్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి, కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్ట్ అనుమతించింది. ఈమేరకు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడిరచింది. 4 రోజులు కస్టడీకి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.
బుధవారం నుంచి శనివారం వరకు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. పొక్సోపై నార్సింగ్ పోలీసులు విచారణ జరపనున్నారు. జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసు కునేందుకు నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలుకి వెళ్లారు. కాగా ఇప్పటికే బాధితురాల నుంచి పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. వీటిని జానీ ముందు పెట్టి ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమ వారానికి వాయిదా పడిరది. కాగా పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాధితురాలు ఇప్పటికే పలు సాక్ష్యాలను సమర్పించారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో విచారణలో జానీ మాస్టర్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.