జేఎన్టీయూ జేవీలో ఐడియేషన్ బూట్ క్యాంప్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జేఎన్టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్ మోడ్‌లో ఒక రోజు ఐడియేషన్ బూట్‌క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమం లో ఉపకులపతి ప్రసంగిస్తూ విద్యార్థులు ఉద్యోగం అనే భావనను మించి ఆలోచించాలని ఉద్ఘాటించారు. వారు ఉద్యోగ అన్వేషణ అనే కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి, సృజనాత్మకతతో వినూత్నంగా ఆలోచించి ఉద్యోగ ప్రదాతలుగా మారాలని తెలిపారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయసుమ విద్యార్థులకు విద్యార్థుల పాత్ర, దేశ వృద్ధికి ప్రభావాలను గురించి తెలియజేశారు. జేఎన్ టీయూ-జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ జొమాటో, ఓలా, ఉబర్, గూగుల్ వంటి వాటిని ఉదాహరణగా చూపుతూ అటువంటి ఆలోచన శక్తినీ విద్యార్థులందరూ పెంపొందిం చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఐఎం వైజాగ్‌కు చెందిన ప్రొఫెసర్. సుశీల్‌కుమార్ రిసోర్స్ పర్సన్‌గా హాజర య్యారు. కార్యక్రమానికి విద్యార్థులు ఆఫ్‌లైన్‌లోను అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులు ఆన్లైన్లో ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు. కార్యక్రమానికి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోఆర్డినేటర్ తిరుమలరావు సమన్వ యకర్తగా వ్యవహరించారు.