ప్రభుత్వ యాజమాన్య పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1 గా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు
కఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా పాఠశాల విద్యారంగాన్ని నాశనం చేస్తున్న సర్వీస్ రూల్స్ సమస్య కారణంగా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఇప్పటికీ వివక్షతను అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 90 శాతానికి పైగా జిల్లా పరిషత్ పాఠశాలలో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఒకే డీఎస్సీ ద్వారా రెండు మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు నియమింపబడినప్పటికీ పదోన్నతుల విషయంలో ఎప్పుడో 50 సంవత్సరాల ముందున్న పద్ధతులను కొనసాగించడం ఇప్పటికీ అదే పద్ధతులను అమలు చేయడం దుర్మార్గం అన్నారు. జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సంఘాలు గత 25 సంవత్సరాలుగా అటు ప్రభుత్వంలోనూ ఇటు న్యాయస్థానంలోనూ వారికి జరుగుతున్న అన్యాయాలను అనేక విధాలుగా వెడమరచి చెప్పినప్పటికీ ఫలితం కనిపించడం లేదు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ఆందోళనను అర్థం చేసుకుని సమస్య పరిష్కారం చేసే కృషి చేస్తున్నప్పటికీ అంతమంది వ్యక్తుల స్వార్థానికి ఒకటి రెండు సంఘాల అభ్యంతరాల వలన కోర్టులో మరల సమస్య మొదటికి వస్తుంద న్నారు. దీని కారణంగా రాష్ట్రంలో విద్యారంగంలో ఎంఈఓ పదో న్నతులు ణవజుశీ పదోన్నతులు ణIజు పదోన్నతులు జేఎల్ పదోన్న తులు నిలిచిపోయినాయి మిగతా డిపార్ట్మెంట్లలో పోల్చుకుంటే 30 నుండి 40 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యా యుడు కూడా ఏ రకమైన ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కు పదోన్నతి లేకుండానే పదవీ విరమణ కావలసి వస్తుందన్నారు. నాడు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సమస్య పరిష్కారం కోసం ఢల్లీి స్థాయిలో కృషి చేసినప్పటికీ కొన్ని సాంకేతిక అభ్యంతరాల వల్ల మళ్ళీ కథ మొదటికి వచ్చింద న్నారు. ఒకే డీఎస్సీ ద్వారా నియమింపబడిన ఉపాధ్యా యులకు సర్వీస్ రూల్స్ సమస్య కారణంగా పదోన్నతులలో తీవ్ర అన్యాయం జరిగి జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు వివక్షకు గురి అవుతున్నా రన్నారు. విజ్ఞులైన ఉపాధ్యాయులు సంఘాలు రాష్ట్రంలో వేర్వేరు మేనేజ్మెంట్లను ఒకే గూడు క్రిందకు తెచ్చి సమన్యాయ సూత్రాన్ని పాటిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని చక్కదిద్దాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెట్టే ఆలోచనతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక స్వరూప్ తీసుకొని కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని ఇమంది పైడి రాజు కోరారు.