ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఈశ్వరరావు ప్రమాణ స్వీకారం
అక్షరకిరణం, (విజయవాడ): ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఈశ్వరరావు మాట్లాడు తూ బాధ్యతతో ముందుకు సాగుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అగ్నికులక్షత్రియ చైర్మన్ చింతలపూడి పాపారావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు బర్రి ప్రసాదరావు, డైరెక్టర్ కుత్తుమ్ లక్ష్మణ్, టీడీపీ వజ్రపుకొత్తూరు మండల ప్రధాన కార్యదర్శి కర్నిరమణ, దున్న షణ్ముఖరావు, గోవింద పాపారావు, చింత నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.