పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
అక్షర కిరణం, (విజయనగరం): దేశ స్వాతంత్య్ర దినోత్సవం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ ఎస్.సేతు మాధవన్ స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్‌ను పరిశీలించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలకు తమ స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. పోలీసుల కవాతును, డాగ్షోను తిలకించారు. వేడుకలకు హాజరైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, డీసీిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, తూర్పుకాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి తదితర ప్రము ఖులను పరిచయం చేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమా లు, శకటాల ప్రదర్శనలను, అగ్నిమాపక శాఖ విన్యాసాలను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, ఉపకరణాలను పంపిణీ చేశారు.