జీవీఎంసీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు ఉద్యోగులతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ 79 వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కార్పొరేటర్లు,అధికారులతో కలిసి ముందుగా జీవీఎంసీ కార్యాలయ సమీపాన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యా లయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు.