లక్ష్ముడుపేట గ్రామంలో భారీ అన్న ప్రసాదం
అక్షరకిరణం, (ఆమదాలవలస): ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈనెల 4వ తేదీ మంగళవారం నుంచి ఘనంగా స్వామివారి ఆలయ వార్షికోత్సవం నిర్వ హిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో పందిరి పాటతోపాటు వివిధ సాంస్కృ తిక, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వహకులు గ్రామస్తులు తెలిపారు. ఆలయ వార్షి కోత్సవాల్లో చివరి రోజు గురువారం అన్న ప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు. గ్రామ ప్రజలతోపాటు సమీప గ్రామ భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయడంపై ఆలయ వార్షికోత్సవ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.