విశాఖలో ఏనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
కఆగ్రహం వ్యక్తం చేసిన హోం మంత్రి అనిత కసీపీకి ఆదేశాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెంగళరావు పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు ఆ చిన్నారిపై నిందితుడు లైగింక వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో బాఇక తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఏసీపీ పెంటారావు ఆదేశాలతో సీఐ జీడీ బాబు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు.
ఘటనపై హోంమంత్రి ఆగ్రహం
కాగా ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి సీపీని ఆదేశించారు. విశాఖ నగరంలోని దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడు చెంగల్రావ్ పేటకు చెందిన వ్యక్తి గా గుర్తించామని హోంమంత్రికి తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.