ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం
కనిందితుడు రామ్‌సింగ్ తేజ్ సింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు
అక్షర కిరణం, (గుజరాత్/జాతీయం): దేశంలో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార సంఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. లోకం తెలియని పసి పిల్లలను కూడా కొంతమంది కామాంధులు వదలడం లేదు. అత్యాచారాలు చేయడం, అడ్డగిస్తే హతమార్చడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం.. తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా గుజరాత్లో అమానుషం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డు దూర్చి.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన 2013లో ఢల్లీిలో జరిగిన నిర్భయ ఘటనను.. గుర్తు చేసింది.
రాజ్‌కోట్ సమీపంలోని జస్దాన్లోని అట్కోట్ ప్రాంతంలో డిసెంబర్ 4వ తేదీ ఉదయం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడిరచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌సింగ్ తేజ్‌సింగ్ అనే వ్యక్తి 7 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ సింగ్ గుర్జర్ తెలిపారు. ఆపై రాడ్‌తో ఆమె ప్రైవేటు భాగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అది గుర్తించిన స్థానికులు.. బాధిత బాలికను హుటాహుటిన రాజ్‌కోట్ ఆస్పత్రికి తరలించారు.
బాధిత బాలిక తల్లిదండ్రులు దాహోద్‌కు చెందినవారని.. వారు రాజ్‌కోట్‌లో కౌలు పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని గుర్తించారు. ప్రస్తుతం రాజ్‌కోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి 10 టీమ్‌లను ఏర్పాటు చేశారు. అనుమానితులను విచారించి.. చుట్టు పక్కల గ్రామాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ఇక అనుమానితులకు సంబంధించిన ఫోటోలను బాలికకు చూపించగా.. అందులో నిందితుడు రామ్‌సింగ్ తేజ్‌సింగ్‌ను గుర్తుపట్టడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బాధిత కుటుంబం పక్కనే ఉన్న పొలంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. దాడికి ఉపయోగించిన ఇనుప రాడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని కోర్టులో హాజరుపరిచి ఏడు రోజుల రిమాండ్‌ను కోరనున్నారు. ఈ కేసును త్వరగా పూర్తి చేయడానికి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసి.. నిందితుడికి కఠిన శిక్ష విధించి బాధితురాలికి న్యాయం చేసేందుకు పోలీసులు ఫోరెన్సిక్ బృందం సహాయాన్ని కూడా కోరారు.