ఆస్తి పన్ను చెల్లించి 50 శాతం వడ్డీ రాయితీ పొందండి
కజిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చ్చార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ పరిధిలోని గృహ యజమానులకు/ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ జీఓఎంఎస్. నెం.46 ఎం.ఏ. యూడీ (సి2) డిపార్టుమెంటు, తేది 25న ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి, జీవీఎంసీకి చెల్లించవలసిన ఇంటిపన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2024-25 సంవత్సరానికి చెల్లించవలసినవి, తేదీ 31.03.2025లోగా ఒకే మొత్తంగా చెల్లిస్తే వాటిపై విధించబడిన వడ్డీపై 50 శాతం మినహాయింపును పొందవచ్చన్నారు. కావున, విశాఖ నగర పరిధిలోని గృహ యజమానులు/ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశం వినియో గించుకొని జీవీఎంసీకి చెల్లించవలసిన ఇంటిపన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. 50 శాతం వడ్డీ రాయితీని పొందాలని కలెక్టర్ కోరారు. ఈ సదావకాశం ఈనెల 31వ తేదీ వరకు మాత్రమేనని తెలియజేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయ పరిధిలోని ప్రతీ గృహ ఇంటి యజమానిని వారి గృహం వద్దనే వార్డు సచివాలయ కార్యదర్శి వచ్చినప్పుడు/ సంప్రదించినప్పుడు వారి ఆస్తిపన్ను బకాయిలను డెబిట్ / క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐతో గాని చెల్లింపులు జరుపవచ్చునన్నారు. ఈ దిగువ బ్యాంకులు, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం అన్ని జోనల్ కార్యాలయాల్లో సౌకర్యం కేంద్రాల వద్ద ఆస్తిపన్ను చెల్లింపుదారులు తమ పన్ను బకాయిలను పనివేళల్లో చెల్లించవచ్చునని తెలిపారు.
ఐడీబీఐ-సిరిపురం బ్యాంక్ బ్రాంచ్, ఐసీఐసీఐ-ద్వారకా నగర్ బ్రాంచ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు-మధురవాడ బ్రాంచ్, యాక్సిస్ బ్యాంకు-రామ్ నగర్ బ్రాంచ్ పనివేళలో సంప్రదించాలన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 31 వరకు ఆదివారం అన్ని జోనల్ కార్యాలయాల్లో అన్ని సౌకర్యం కేంద్రాలు సాధారణ సెలవు దినములలో కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. కావున నగరంలోని గృహ యజమానులు జీవీఎంసీకి చెల్లించవలసిన ఇంటిపన్నులు, ఖాళీ జాగా పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని విని యోగించుకొని ఈనెల 31వ తేదీలోగా చెల్లించి వడ్డీ రాయితీని పొంది నగర అభివృద్ధిలో కార్పొరేషన్‌కు చేయూ తనందించాలని కలెక్టర్ కోరారు.