నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో శిక్షణ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ఏపీఎస్ఎస్ ఈసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచి తంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు, ఏపీ ఎస్ఎస్ డీసీ ప్రతినిధి రెహానా ఖాన్ తెలిపారు. మంగళవారం విశాఖపట్నం గీతం, సెయిం ట్ లుకేస్, విజయ్ లుకేస్, బీఎస్పీ నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ, అనంతరం జర్మనీలో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని, వీసా, ప్రయా ణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జర్మనీలో నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి వసతి, ఆరోగ్యబీమా, పింఛను సదుపాయాలు కల్పిస్తామని జర్మనీ దేశ ప్రతినిధి విక్టోరియా తెలిపారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు రవి కిషోర్, బోరడా కార్తీక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.