మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నీచర్ మాయం..
ఇంటి దొంగల పనేనని అనుమానాలు చర్యలు తీసుకోవాలంటూ కార్మిక నేతల డిమాండ్
అక్షర కిరణం (సాలూరు): సాలూరు మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయ మైంది. లక్షల రూపాయల విలువ చేసే ఫర్నీచర్ మాయం కావడంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం మున్సిపాలిటీ ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్‌కు వినతి పత్రం అందజేశారు. 2013లో ప్రత్యేక విభాగాధికారి పాలన లో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్రాంతి గదిని ఏర్పాటు చేశారు. ఈ విశ్రాంతి గదుల్లో డైనింగ్ టేబుల్, కుర్చీలు, దివాన్ కాట్ బెడ్డు తదితర ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఈ ఫర్నీచర్ కొద్ది రోజుల కిందట ఈ విలువైన ఫర్నీచర్ మాయం కావడంతో ఇది ఇంటి దొంగల పనే అయ్యి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కార్మిక నాయకులు శంకర్రావు, వెంకట్రావు, కుర్మారావు, టి.రాయుడు, ఎన్.వై.నాయుడు తదితరులు డిమాండ్ చేశారు.