ఉధృతమైన కృష్ణానది వరద
కవేగవంతమైన సహాయక చర్యలు
కపవర్బోట్లు విజయవాడ చేరిక
అక్షర కిరణం, (విజయవాడ/అమరావతి): కృష్ణా నది వరద ఉధృతంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులకు చేరింది. విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో చేరుకున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీ ఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే వాయు మార్గంలో సహాయక చర్యలు నిర్వహించాలని నిర్ణయిం చారు. విజయవాడ నాలుగు చాపర్లు రానున్నాయని అది óకారులు తెలిపారు. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని చెప్పారు. ప్రజలు పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు
సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించి పవర్‌బోట్లు విజయవాడకు చేరుకున్నాయి. ఆదివారం కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్‌బోట్లు చేరుకున్నాయి. బోట్స్‌తో సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. పెద్దఎత్తున బోట్లు రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం అయ్యాయి. పునరా వాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిళ్లను ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రలతో ప్రభుత్వం వారికి ఆహారం సమకూర్చింది. కాగా ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటించి సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలతో అధికార యంత్రాంగం వేగవంతంగా పనులు నిర్వహిస్తోంది.